బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 75 హైలైట్స్

32
siri

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 75 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 75వ ఎపిసోడ్‌లో భాగంగా సిరి- షన్ను హద్దులు మీరి రొమాన్స్ చేసుకున్నారు. లిప్ లాక్‌తో రచ్చ రచ్చ చేశారు. పవర్ రూంలోకి వెళ్లిన రవి.. తనకు వచ్చిన పవర్‌ను సన్నీకి ఇస్తానని నిర్ణయించుకున్నాడు. అయితే తనకు పవర్ అవసరం లేదని సన్నీ చెప్పగా ఇది బిగ్ బాస్ నిర్ణయం.. తీసుకోవాల్సిందే అని అన్నాడు. చివరకు బిగ్ బాస్ ఆదేశంతో సన్నీ ఆ పవర్‌ను వాడాడు.

హెల్మెట్ సొంతం చేసుకుని గోల్డ్ మైన్ చేసేందుకు రెడీగా ఉన్న మానస్, ఆనీ, శ్రీరామచంద్రలోంచి ఎవరో ఒకరిని తప్పించి.. ఆ స్థానంలో గోల్డ్ మైన్ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది ఆ పవర్. దీంతో శ్రీరామచంద్రను పక్కకు తప్పించాడు. ఆ స్థానంలో సన్నీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత మానస్, ఆనీ మాస్టర్ల వద్ద ఎక్కువ సంఖ్యలో బంగారం ఉండటంతో ఆ ఇద్దరికీ ఓ టాస్క్ పెట్టగా అనీ గెలిచింది.

అలా మొత్తానికి ప్రియాంక, సిరి, ఆనీలు కెప్టెన్సీ కంటెండర్లు మారారు. మరో కంటెండర్ కోసం ఎక్కువ గోల్డ్ ఉన్న ముగ్గురు సభ్యులను తెలియజేయమన్నాడు బిగ్ బాస్. మానస్, సన్నీ, కాజల్ వద్దే ఎక్కువగా ఉండటంతో ఆముగ్గురికి మరో టాస్క్ పెట్టారు. మ్యాథ్స్ టాస్క్ అంటూ 17 నంబర్లతో మొత్తంగా 143 వచ్చేలా నంబర్ బోర్డులను తగిలించాలన్నాడు. దీంతో మానస్ గెలిచాడు. అలా నలుగురు కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు.

సిరి, షన్నుల మధ్య ఎందుకు గొడవ జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కాసేపటికే ఇద్దరూ ఘాఢంగా హత్తుకున్నారు. ఆ సమయంలో కావాలని జరిగిందో లేక తెలీకుండా జరిగిందో కానీ ఇద్దరూ ముద్దులు పెట్టుకున్నట్టు అనిపించింది. మొత్తంగా సిరి, షన్నులు బిగ్ బాస్ ఇంట్లో హద్దులు దాటేయగా మానస్‌తో తన బాధను చెప్పుకుని ఏడ్చేసింది ప్రియాంక.