ఎల్బీనగర్‌లో రెచ్చిపోతున్న దొంగలు..

329
dilsukhnagar
- Advertisement -

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఖరిదైన కార్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంటిముందు పార్క్‌ చేసిన కారును దొంగలు చాకచక్యంగా ఎత్తుకెళ్లిపోతున్నారు.

ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలోని లలిత నగర్‌ కాలనీలో ఇంటి ముందు పార్క్‌ చేసిన ఫార్చునర్‌ కారును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Ap29 CA 1212 ను 2 గంటల ప్రాంతం లో స్విఫ్ట్ కార్ లో వచ్చిన నలుగురు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విడియో మెత్తం సీసీ కెమెరాలో రికార్డయింది. ఫార్చునర్ కారును దొంగలించి అలకాపురి సైడ్ వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -