సీజనల్ గా వచ్చే వ్యాధులలో జ్వరం చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలమంది జ్వరం బారిన పడుతూ ఉంటారు. దీనికి కారణం వాతావరణంలో జరిగే మార్పులు ఒక కారణం అయితే.. వివిధ రకాల ఫ్లూ వైరస్ లు, బ్యాక్టీరియా వంటివి మరో కారణం. వర్షాకాలంలో నీటి కలుషితం మరియు ఆహార కలుషితం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి జ్వరం బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే జ్వరం ఉన్నవాళ్ళు ఏది పడితే అది తినకూడదు. ఎందుకంటే మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు జ్వరం మరింత పెరగడానికి ప్రభావం చూపుతాయి. కాబట్టి జ్వరంతో ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో ఒకసారి తెలుసుకుందాం !
మాంసాహారం
జ్వరంతో ఉన్న వాళ్ళు మాంసహరానికి దూరంగా ఉండాలి. మాంసాహారంలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. తద్వారా జ్వరంతో ఉన్నవాళ్ళు మాంసాహారం తింటే సరిగా జీర్ణంకాక.. అజీర్తి, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా బాడీ టెంపరేచర్ ను కూడా మాంసాహారం పెంచుతుంది కాబట్టి జ్వరం తీవ్రత మరింత ఎక్కువౌతుంది.
పాల పదార్థాలు
సాధారణంగా పాల పదార్థాలు శరీర పుష్టిని కలిగిస్తాయి. కానీ జ్వరంతో ఉన్నప్పుడూ పాల పదార్థాలు తింటే జలుబు దగ్గు వంటి సమస్యలు ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి జ్వరంతో ఉన్న వాళ్ళు పాల పదార్థాలకు కూడా దూరంగా ఉండడం మంచిది.
Also Read:‘చక్కి చలనాసనం’ వేస్తే ఎన్ని లాభాలో..!
మద్యం
జ్వరంతో ఉన్నప్పుడూ మద్యం సేవించడం కూడా మంచిది కాదు. మద్యం సాధారణంగానే మైగ్రీన్ సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి జ్వరంతో ఉన్నప్పుడూ మద్యం సేవిస్తే తలనొప్పి, పెరగడంతో పాటు వాంతులు, విరోచనలు ఏర్పడే ప్రమాదం ఉంది.
కాబట్టి జ్వరంతో ఉన్నవాళ్ళు ఇలాంటి వాటి జోలికి పోకుండా రోగ నిరోధక శక్తిని పెంచే పండ్ల జ్యూస్ లు, కొబ్బరి నీళ్ళు, ఆయా రకాల పండ్లు ఎక్కువగా తింటే మంచిదని నిపుణులు చెబుతున్న మాట.
Also Read:చాక్లెట్స్ తినడం మంచిదేనా..?