ఈ ఆసనాలతో గుండెపోటు కు చెక్..!

55
- Advertisement -

నేటి రోజుల్లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అసలు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురౌతున్నారు చాలమంది. గుండెపోటు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో కొవ్వు పెరుకుపోయినప్పుడు హార్ట్ ఎటాక్ ఏర్పడుతుంది. కాబట్టి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజూ శారీరక శ్రమ తప్పనిసరి అని, అందుకోసం వ్యాయామం, యోగా వంటివి తప్పక చేయాలని నిపుణులు చెబుతున్నారు. కాగా యోగాలో గుండెపోటును దూరం చేయడానికి పలు ఆసనాలు ఉపయోగ పడతాయి. ఆ ఆసనాలు ఏంటో చూద్దాం !

అధోముఖ స్వనాసనం
ఈ ఆసనం గుండె కు రక్త ప్రసరణ సవ్యంగా జరిగిలే చూస్తుంది. అంతే కాకుండా హృదయ కండరాలను బలపరుస్తుంది. ఏకాగ్రతను పెంచి మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. తద్వారా గుండె సమస్యలు దురమౌతాయి.
చేయు విధానం
ముందుకు ఒంగి చేతులను నెలకు ఆనించాలి.కాళ్ళకు చేతులకు మద్య కనీసం ఒక మీటర్ దూరం ఉండాలి. నడుము భాగం పర్వతాన్ని పోలి ఉండాలి. ఇలా ఈ ఆసనం ప్రతిరోజూ 5-10 నిముషాల పాటు వేయాలి.

భుజంగాసనం
ఈ ఆసనం కూడా గుండె సమస్యలను దూరం చేస్తుంది. ఒక చదునైన నేలపై బోర్లా పడుకొని రెండు చేతులను నేలకు ఆనించి వాటి సపోర్ట్ తో తలభాగం నుంచి నడుము పైకెత్తాలి. ఇలా చేసేటప్పుడు శ్వాసక్రియ నెమ్మదిగా జరిగించాలి.

సేతు బంధాసనం
ఈ ఆసనం వెల్లకిల పడుకొని వేయు ఆసనం. ముందుగా చదునైన నేలపై వెల్లకిల పడుకొని కాళ్లను నడుము భాగం వరకు తీసుకొని వచ్చి కాళ్ళ సహాయంతో నడుమును వీలైనంతా పైకి ఏత్తాలి. ఇలా చేసేటప్పుడు ఛాతీ భాగం నేలకు అని ఉండాలి. ఇలా చేయడం వల్ల గుండె రక్త ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బులు రావు.

Also Read:కడుపు నొప్పిని తగ్గించే చిట్కాలు

- Advertisement -