రూ.2.20 లక్షలు పంపాడు.. తర్వాత ఫోన్ స్విచ్చాఫ్..

276
The Young man Lossed To Rs.2.20 lacks As Cyber Cheater
- Advertisement -

సైబర్ మోసాల గురించి రోజు చూస్తూనే ఉంటాం.. వింటునే ఉంటాం.. మరోవైపు సైబర్ మోసాల గురించి అటు పోలీసులు, ఇటు సామాజిక సంస్థలు జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేస్తున్నా కొంతమంది యువకులు ఆ సైబర్ మాయగాళ్ల ఉచ్చులో పడి మోసపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ఓ యువకుడు రూ.2.20 లక్షలు మోసపోయాడు. అసలు జరిగిన విషయం ఏంటంటే. రాచకొండ పరిధిలో నివస్తున్న ఓ యువకుడు వధువు కావలెను అంటూ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో ప్రోఫైల్ తో పాటు ఫోటో కూడా పెట్టాడు. ఈ పోస్టుకు ఓ గుర్తుతెలియని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. నా పేరు జియా, తాను మెడికల్ ప్రాక్టీషనర్ నంటూ ఓ విదేశి యువతి సోషల్ మీడియాలో ఈ యువకుడితో పరిచయం చేసుకుంది.

The Young man Lossed To Rs.2.20 lacks As Cyber Cheater

ఇలా ఇద్దరి పరిచయం దృఢంగా మారింది. దాదాపు మూడు నెలల పాటు చాటింగ్ చేసుకున్నారు. ఇదే క్రమంలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుని ఇండియాలోనే స్ధిరపడాలని అనుకుంటున్నా అంటూ యువతి నమ్మించింది. తనకు ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఇండియాకు వస్తానని ఇద్దరం సంతోషం ఉండవచ్చని చాటింగ్ లో వివరించింది. ఒక రోజు జియా నుంచి అకస్మాత్తుగా యువకుడికి ఫోన్ వచ్చింది. తాను ఇండియాకు వచ్చేశానని ఢిల్లీలో ఉన్నానని.. నిన్ను ఆశ్చర్యపర్చేందుకు 5 వేల డాలర్లతో వచ్చేశానని, విలువైన వస్తువులు తీసువచ్చానని తెలిపింది.

జియా మాటలు విని ఆనందంలో మునిగితేలుతున్నఆ యువకుడికి కొద్ది సేపటి తర్వాత జియా నుంచి మరో కాల్ వచ్చింది. నన్ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని, నా కరెన్సీ, విలువైన వస్తువులు సీజ్ చేశారంటూ.. వాటిని విడిపించాలంటే నగదు కట్టాలని చెప్పింది. కానీ నా దగ్గర ఇండియా కరెన్సీ లేదు, డబ్బులు పంపించాలంటూ పలు బ్యాంక్ అకౌంట్లు పంపించింది. ఇదంతా నిజమే అని నమ్మిన ఆ యువకుడు ఆమె పంపిన అకౌంట్ నంబర్ కి రూ.2.20 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు.

అంతే డబ్బు పంపించిన మరుక్షణమే ఆ యువతి ఫోన్ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఇక మోసపోయానని గమనించిన యువకుడు రాజకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఇది నైజీరియన్ దేశానికి చెందిన సైబర్ మోసంగా గుర్తించారు. ఆ యువకుడితో చాటింగ్ చేసింది. ఢిల్లీ వచ్చినట్లు ఫోన్ చేసింది కూడా సైబర్ మాయగాడి పని
అని తేల్చారు. ఈ సైబర్ మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -