ప్రచార ప్రకటనలో ‘విరుష్క’ జోడీ..

234
- Advertisement -

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ తన ప్రేయసి అనుష్కతో కలిసి ఓ యాడ్‌లో నటించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. కోహ్లీ ఓ వస్త్ర దుకాణ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు, అక్టోబర్లలో దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఈ వస్త్ర దుకాణం నిర్వహించిన ప్రత్యేక షూట్‌లో వీరిద్దరూ కలిసి నటించినట్లు సమాచారం.

Virat Kohli, Anushka Sharma exchange new-age wedding vows

‘మోహే’ బ్రాండ్‌కు ‘కోహ్లీ-అనుష్క’లు ఇటీవల ప్రచారకర్తలుగా నియమితులయ్యారు. తాజాగా వీరిద్దరు కలిసి నటించిన ప్రచార ప్రకటన ఇదే అంటూ సోషల్‌మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. కోహ్లీతో కలిసి అనుష్క శర్మ ప్రచార ప్రకటన చేయనున్నారని ఆ సంస్థ నిర్వాహకులు గతంలో వెల్లడించారు. కొత్త వివాహ కలెక్షన్‌ను విడుదల చేయడంతో పాటు విక్రయశాలల సంఖ్యను రెట్టింపు చేయడానికి మోహే సన్నాహాలు చేస్తోందని ఆ సంస్థ ఎండీ రవీ మోదీ తెలిపారు.

ఇప్పుడు ఈ వీడియో కూడా బయటకు రావడంతో ఆ ప్రకటన ఇదే అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ వీడియోలో ఓ పెళ్లి వేడుకకు సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ‘కోహ్లీ-అనుష్క’ జోడీ ఆకట్టుకుంది. సుమారు నిమిషం 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘విరుష్క’ జోడీ మధ్య కెమిస్ట్రీని చూసి ఫిదా అయిపోతున్నారు. ‘ఈ జంట ఎంతో బాగుందో’, ‘ఈ జంట పెళ్లిపీటలు ఎప్పుడు ఎక్కుతుందో’ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

- Advertisement -