తమిళ మల్టీస్టారర్‌లో అల్లు శిరీష్..

207
Allu Sirish is also a part of Suriya’s next
- Advertisement -

హీరో సూర్య, మలయాళ విలక్షణ నటుడు మోహన్‌ లాల్ కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడని ఇటీవలె లైకా సంస్థ అధికారికంగా ప్రకటనను వెల్లడించింది. గతంలో సూర్య హీరోగా వీడొక్కడే, బ్రదర్స్‌ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్‌ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ ఇద్దరి స్టార్ హీరోల పక్కన ఓ మెగా హీరో నటించనున్నాడు.

 Allu Sirish is also a part of Suriya’s next

‘గౌరవం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో అల్లు శిరీష్ ఈ సినిమాలో నటించనున్నానని తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. నా ఫేవరెట్ హీరో సూర్యతో కలిసి నటించటం, మోహన్‌ లాల్‌ లాంటి టాప్‌ హీరోతో రెండో సారి కలిసి నటించే అవకాశం రావటం ఆనందంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు శిరీష్. గతంలో శిరీష్ విన్నూత్న కథాంశంతో తెరకెక్కిన ‘ఒక్క క్షణం’ సినిమాతో పరావాలేదనిపించాడు. ఓ ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాలో అల్లు వారి అబ్బాయి చేరడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. వీడొక్కడే, బ్రదర్స్‌ లాంటి విన్నూత్న సినిమాలతో దూసుకుపోతున్న కేవి ఆనంద్ ఈ సినిమాతో ఎలాంటి ప్రయోగం చేయనున్నాడో చూడాలి.

https://twitter.com/AlluSirish/status/995535755081605120

- Advertisement -