విపక్షాలే టార్గెట్.. అదంతా షా వ్యూహమే !

29
- Advertisement -

కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, వంటివి కేంద్రం గుప్పెట్లో పని చేస్తున్నాయనేది జగమెరిగిన సత్యం. బీజేపీయేతర పార్టీ నేతలపై, బీజేపీకి అడ్డుగా నిలిచే నాయకులపై ఈ సంస్థల ద్వారా నోళ్ళు మూయించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇప్పటివరకు కేంద్రాన్ని ప్రశ్నించే విపక్ష నేతలందరు కూడా వీటి బారిన పడినవాళ్లే. బహుశా ఈ స్థాయిలో బీజేపీయేతర నేతలపై కక్ష పూరితంగా వ్యవహరించడం ఒక్క బీజేపీ ప్రభుత్వానికే చెల్లింది. అయితే ఇదంతా కూడా అమిత్ షా వ్యూహంలో భాగంగా జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం.

ఆప్ నేతలు, తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ నాయకులు, డీఎంకే పార్టీకి చెందిన వాళ్ళు, బి‌ఆర్‌ఎస్ పార్టీ నేతలు.. ఇలా బీజేపీపై ప్రశ్నలు సంధించే ప్రతిఒక్కరి పై కాషాయ పార్టీ ఉపయోగిస్తున్న అస్త్రం మని లాండరింగ్ ఆరోపణలు చూపడం. అయితే ఇప్పటివరకు విపక్ష నేతలే టార్గెట్ గా ఈడీ జరిపిన రైడ్ లు వేలల్లో ఉండగా, వాటిలో నిరూపితం అయినవి కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు విపక్షాలపై బీజేపీ ఎంత కక్ష పూరితంగా ఉందనేది.

Also Read: నల్ల పసుపు వల్ల ఎన్ని ఉపయోగాలో.. !

ఇక ఈ మధ్య అమిత్ షా ఏ రాష్ట్రం వెళితే ఆ రాష్ట్రంలో ఈడీ మకాం వేస్తోంది. ఆ మధ్య తమిళనాడు అమిత్ షా రెండు రోజుల పర్యటన మరువక ముందే డీఎంకే నేత ఆ రాష్ట్ర విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ పై ఈడీ రైడ్ నిర్వహించి అరెస్ట్ కూడా చేసింది. ఇక గతంలో పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, వంటి రాష్ట్రాలలో అమిత్ షా పర్యటన అనంతరం ఆ రాష్ట్రాలలోని బీజేపీ యేతర పార్టీ నేతలపై ఈడీ రైడ్ లు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ కూడా బి‌ఆర్‌ఎస్ నేతల లక్ష్యంగా ఈడీ రైడ్ లు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం అమిత్ షా బుధవారం తెలంగాణకు రావాల్సిఉంది. కానీ గుజరాత్ లో ఏర్పడిన తుఫాన్ కారణంగా షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ లోగా తెలంగాణలో హఠాత్తుగా ఈడీ సోదాలు జరుగుతుండడంతో ఇదంతా అమిత్ షా వ్యూహంగానే పరిగణిస్తున్నారు విశ్లేషకులు.

Also Read: సౌత్ టార్గెట్.. మోడీ మాస్టర్ ప్లాన్ ?

- Advertisement -