సౌత్ టార్గెట్.. మోడీ మాస్టర్ ప్లాన్ ?

75
- Advertisement -

సౌత్ రాష్ట్రాలలో పాగా వేయాలని బీజేపీ కంటున్న కలలు అన్నీ ఇన్ని కావు. ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాలలో సత్తా చాటాలని చూస్తున్నప్పటికి బీజేపీ ఆశలు మాత్రం ఫలించడం లేదు. నిన్న మొన్నటి వరకు కర్నాటకలో అధికారం ఉందనే సంతోషం ఇటీవల జరిగిన ఎన్నికలతో దూరమైంది. దాంతో ప్రస్తుతం సౌత్ రాష్ట్రాలలో బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే సమయం వచ్చిందనే వాదన రోజు రోజుకు బలపడుతోంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఇలా ఏ రాష్ట్రం తీసుకున్న బీజేపీ ఉనికే లేని పరిస్థితి. దీంతో ప్రస్తుతం సౌత్ రాష్ట్రాలలో బీజేపీని బలపరచాలని కాషాయ పెద్దలు గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. .

అందుకే ఇటీవల వరుసబెట్టి బీజేపీ పెద్దలు సౌత్ రాష్ట్రాలలో పర్యటనలు చేస్తున్నారు. కాగా బలంలేని రాష్ట్రాలలో ఎలా బలం పొందాలో.. ఎలా అధికారం చేజిక్కించుకోవాలో బీజేపీ కమలనాథులకు తెలిసినంతగా మరెవరికి తెలియదనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా ఇప్పుడు సౌత్‌లో బలపడేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ విషయంలో ఏకంగా మోడీనే రంగంలోకి దించే విధంగా ప్రణాళికలు రచిస్తోందట కాషాయ పార్టీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని తమిళనాడు నుంచి పోటీ చేసే విధంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Also Read: పవన్ విజయ యాత్ర.. లక్ష్యమదే !

ఇప్పటికే నిర్మల సీతరామన్ వంటి వారు మదురై నుంచి పోటీ చూస్తున్నారు. ఇప్పుడు మోడీ కూడా తమిళనాడు నుంచి పోటీ చేస్తే ఆ రాష్ట్రంతో పాటు ఇతర సౌత్ రాష్ట్రాలలో కూడా మోడీ మేనియా కొనసాగుతుందనేది కమలనాథుల ప్లాన్ గా తెలుస్తోంది. దీని విషయమై ఇప్పటికే అమిత్ షా తమిళనాడు బీజేపీ నేతలతో చర్చలు కూడా జరిపారట. కాగా నార్త్ లో మోడీ మంత్రం ఫలించినప్పటికి సౌత్ లో ఏమంత ప్రభావం చూపే అవకాశం లేదనేది కొందరి వాదన. దీనికి ఉదాహరణ ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికలనే చెప్పుకొచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో మోడీ అక్కడ 10 రోజులు పర్యటించి ప్రచారం చేసినప్పటికీ బీజేపీకి ఓటమి తప్పలేదు. ఆ విధంగా సౌత్ రాష్ట్రాలలో ఏకంగా మోడీ పోటీ చేస్తే గెలుపు కష్టమే అనేది కొందరి అభిప్రాయం. మరి సౌత్ రాష్ట్రాలే లక్ష్యంగా బీజేపీ ప్లాన్లు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read: బీజేపీ ” సినీ గాలం “.. వర్కౌట్ అవుతుందా ?

- Advertisement -