పవన్ కాన్ఫిడెన్స్ కు కారణం అదే ?

39
- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలపై గట్టిగానే దృష్టి పెట్టారు. పార్టీ స్థాపించి పదేళ్ళు అయిన ఇంతవరకు అసెంబ్లీలో జనసేన ఎమ్మేల్యేలు లేకపోవడం పవన్ ఎంతో షేమ్ గా భావిస్తున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని, కనీసం 20 నుంచి 30 సీట్లు కైవసం చేసుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. గత ఎన్నికల్లో బరిలోకి దిగిన జనసేనకు ఊహించని విధంగా చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కూడా రెండు చోట్ల ఓడిపోయి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆ ఎన్నికల్లో లభించిన ఓటమి.. పవన్ కు గట్టి గుణపాఠం నేర్పిందనే చెప్పాలి.

అప్పటి నుంచి పార్టీని క్షేత్ర స్థాయిలో బలపరచుకుంటూ నిత్యం ప్రజల్లో జనసేన పై సానుకూలత పెంచుతూ ప్రస్తుతం పార్టీని పటిష్టంగా మార్చారు పవన్. వైసీపీకి ప్రధాన పోటీ జనసేననే అని వైసీపీ నేతలు కూడా భావించేలా ఆ పార్టీ విస్తరించింది. దీంతో ఈసారి అసెంబ్లీలో ఎలాగైనా అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా ప్రారంభించిన వారాహి విజయయాత్రలో పవన్ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో తనను కక్షపూరితంగా ఓటమిపాలు చేసి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారని, కానీ ఈసారి ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన, ఎన్ని కుతంత్రలు చేసిన తాను అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతానని సవాల్ విసిరారు.

Also Read: సౌత్ టార్గెట్.. మోడీ మాస్టర్ ప్లాన్ ?

మరి పవన్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటివరకు వస్తున్న సర్వేలు, విశ్లేషణలు జనసేనపై సానుకూల రిపోర్ట్ ఇస్తున్నాయి. ఈసారి ఏపీ ఎన్నికల్లో జనసేన ముద్రా గట్టిగా ఉండబోతుందని చెప్పకనే చెబుతున్నాయి. అటు ప్రజల్లో కూడా పవన్ పై అవినీతి రహితుడని, నిస్వార్థపరుడనే భావన మెండుగా ఉంది. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ తో పోల్చితే పవన్ 10 రేట్లు మేలనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పవన్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలుపుపై పవన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నదనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

Also Read: లోక్‌సభలో ఇక నుంచి బీఆర్‌ఎస్‌

- Advertisement -