నల్ల పసుపు వల్ల ఎన్ని ఉపయోగాలో.. !

59
- Advertisement -

పసుపు గురించి మనందరికి తెలిసే ఉంటుంది. పసుపును వంటల్లో ఎంతో విరివిగా ఉపయోగిస్తూ ఉంటాము. ఒకవిధంగా చెప్పాలంటే పసుపు లేనిదే ఏ వంట పూర్తి కాదు. కూరల యొక్క రుచిని పెంచడంలో పసుపు ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాగా పసుపు యాంటీ బయోటిక్ లా కూడా పని చేస్తుందని మనందరికి తెలిసిందే. గాయాలు అయినప్పుడు మన పెద్దలు పసుపు పెట్టుకోమని సలహా ఇస్తూ ఉంటారు. అలాగే వివిధ ఆయుర్వేద ఔషధాలలో కూడా పసుపును ఉపయోగిస్తుంటారు ఆయుర్వేద వైద్యులు. ఇదిలా ఉంచితే పసుపులో రెండు రకాలు ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలియదు. మనం వంటల్లో ఉపయోగించే పసుపు ఎల్లో రంగులో ఉంటే.. మరో రకం పసుపు లేత నలుపు రంగులో ఉంటుంది. దీనిని ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలలో పండిస్తూ ఉంటారు. దీనిని కేవలం ఆయుర్వేద ఔషధ తయారీలో మాత్రమే ఉపయోగిస్తారు. మరి నల్ల పసుపు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Also Read: లివర్‌ చెడిపోవడానికి కారణం..?

నల్ల పసుపు శరీరంపై గాయాలను నయం చేయడంలో ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ బయోటిక్ గుణాలు. రక్తాన్ని త్వరగా గట్టకట్టేలా చేసి గాయాన్ని త్వరగా మాన్పే విధంగా చేస్తుంది. ఇక జీర్ణ సమస్యలను కూడా నల్ల పసుపు దూరం చేస్తుంది. కడుపులో నొప్పి, గ్యాస్, ఉబ్బరం, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఒక స్పూన్ నల్ల పసుపు పొడిని వేడి నీటిలో కలిపి తాగితే ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక చర్మానికి కూడా నల్ల పసుపు ఎంతో మేలు చేస్తుందట. సాధారణ పసుపు వలె చర్మ నిగారింపుకు నల్ల పసుపును ఉపయోగిస్తే చర్మ సమస్యలు తొలగి చర్మం నిగారింపుగా ఉంటుందట. ఇక కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధ పడేవారు నల్ల పసుపుకు కొద్దిగా నీటిని కలిపి కాస్త జిగటగా ఉన్నప్పుడే పేస్ట్ లా మోకాళ్ళకు అప్లై చేస్తే ఆ సమస్యలు తగ్గుతాయట. కాబట్టి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న నల్ల పసుపును పై పైన చెప్పిన సమస్యలు ఉన్న వాళ్ళు నిరభ్యంతరంగా వాడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read: కంటి చూపు కాపాడుకోండిలా !

- Advertisement -