పార్లమెంట్ తో పాటు, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు జరపడమే లక్ష్యగా కేంద్రంలోని మోదీ సర్కార్ లోక్ సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది. జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సభలో బిల్లును ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి అర్జున్ మేఘావాల్. బిల్లు అమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం. బీజేపీ కూటమికి 293 మంది ఎంపీల మద్దతు ఉండగా ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది.
జమిలి ఎన్నికలకు సంబంధించి ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి.రాజ్యాంగంలో పార్లమెంట్ పదవి కాలాన్ని సూచించే ఆర్టికల్ 83, అలాగే రాష్ట్రపతి పాలనను సూచించే 85, రాష్ట్రాల అసెంబ్లీ పదవి కాలాన్ని సూచించే ఆర్టికల్ 172, 174 వంటి చట్టాలను సవరించాల్సి ఉంటుంది.ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే సాధ్యమయ్యే పనికాదు. జమిలి ఎన్నికలు నిర్వహించిన.. ఆ తరువాత ఏదో ఒక రాష్ట్రంలో అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం రాద్దైతే.. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనేది అతిపెద్ద సవాల్.
వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తేమీ కాదు. 1952,1957,1962,1967 వరకు లోక్ సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల అసెంబ్లీలను బర్తరఫ్ చేయడంతో జమిలీ ఎన్నికలు కనుమరుగైపోయాయి.
ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం 67 శాతం ఓట్లతో అమోదించాల్సి ఉంటుంది. అలాగే ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు అమోదముద్రవేయాలి. లోక్‌సభలో ఎన్డీయే బలం 61 %, రాజ్యసభలో 38 % బలం ఉంది. కానీ ఉభయసభల్లో 67 శాతం ఓట్లతో అమోదించాలి. ఈ నేపథ్యంలో బిల్ ఎలా పాస్ అవుతుందో వేచిచూడాలి.
Also Read:KTR: కేసులు పెట్టి శునకానందమా?