ఎక్కువ మంది ఇష్టపడిన పాట ఎదో తెలుసా?

225
ala-vikuntam

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురంలో. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా…రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు. కాగా ఈమూవీ నుంచి సామజవరగమన అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఈపాటకు అద్బుతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది.

ఇప్పటివరకుఈసాంగ్ ను 41మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈపాటకు ఏకంగా 7లక్షల లైక్స్ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.. తెలుగులో ఒకపాటకు ఇన్ని లైక్స్ రావడం ఇదే తొలిసారి. తాజాగా ఈవిషయాన్ని అల్లు అర్జున్ కూడా తన ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఎక్కువ మంది లైక్ చేసిన తెలుగు పాట ఇది. మీ ప్రేమ‌కి ధ‌న్యావాదాలు అని పోస్ట్ పెట్టారు బ‌న్నీ. ఇక ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ అభిమానులు ఈమూవీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.