లెజెండ్ శరవణన్ మల్టీ లాంగ్వెంజ్ భారీ పాన్-ఇండియా చిత్రం ‘ది లెజెండ్’ తో కధానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన ఈ మాస్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జెడి-జెర్రీ. ఊర్వశి రౌటేలా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ కీలక పాత్రలు పోహిస్తున్నారు. లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ జులై 28న ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో లెజెండ్ శరవణన్, ఊర్వశి రౌటేలా, లక్ష్మీ రాయ్, జేడీ జెర్రీ, ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు తదితరులు పాల్గొన్నారు.
లెజెండ్ శరవణన్ మాట్లాడుతూ.. మీ అందరూ చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ఒక కామన్ మాన్ ఎలా లెజెండ్ గా ఎదిగాడు? అతని ప్రయాణంలో ఎలాంటి సవాల్ ని అధిగమించాడనేది ది లెజెండ్ లో అద్భుతంగా చూపించాం. ఇది చాలా భారీ చిత్రం. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ అన్నీ ఎలిమెంట్స్ వున్నాయి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేశారు. ది లెజెండ్ జూలై 28న మీ ముందుకు వస్తుంది. మీరంతా చూసి విజయవంతం చేయాలి” అని కోరారు.
ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. శరవణన్ స్టోర్ అనేది తమిళనాడులో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వుండే ఒక బ్రాండ్. ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాని ప్రోడ్యుస్ చేసి లెజెండ్ శరవణన్ యాక్ట్ చేశారు. చాలా రిచ్ గా వుంటుంది. కొత్త కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్ ని ఎప్పుడూ ఆదరిస్తారు. ఇది ఆయన మొదట సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అవుతారు. టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ ఈ చిత్రం కోసం పని చేశారు. ఒక సక్సెస్ ఫుల్ చిత్రానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి మంచి విజయాన్ని అందించాలి” అని కోరారు.
జెడి మాట్లాడుతూ.. ది లెజెండ్ బిగ్ బడ్జెట్ మూవీ. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ లో చూడాలి. లెజెండ్ శరవణన్ గారు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్. ఒక నటుడిగా ఆయనకి చాలా కమిట్ మెంట్ వుంది. సినిమా అంటే చాలా ప్యాషన్ వుంది. ఆయన డెడికేషన్ ని స్క్రీన్ పై చూస్తారు. ఊర్వశి రౌటేలా అద్భుతంగా చేసింది. లక్ష్మీ రాయ్ స్పెషల్ ఎప్పిరియన్స్ లో ఆకట్టుకుంది. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
జెర్రీ మాట్లాడుతూ.. లెజెండ్ శరవణన్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని రూపొందించారు. ఒక నటుడిగా యాక్షన్ కామెడీ రోమాన్స్ ఇలా అన్ని కోణాల్లో అద్భుతంగా చేశారు. తప్పకుండా అందరినీ తన నటనతో సర్ప్రైజ్ చేస్తారు. ఊర్వశి బ్రిలియంట్ యాక్టర్. చాలా హుషారుగా నటిస్తుంది. లక్ష్మీ రాయ్ సింగల్ టేక్ ఆర్టిస్ట్. ఇందులో అద్భుతంగా చేసింది. ప్రసాద్ గారు అద్భుతమైన నిర్మాత. ఆయన తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ప్రేమ. సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. తెలుగు, తమిళ్ సినిమా ఇండియన్ సినిమాకి రెండు కళ్ళు. ది లెజెండ్ మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఇది చాలా పెద్ద సినిమా. అందరూ 28న థియేటర్ లో చూడాలి”అని కోరారు.
ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ.. ది లెజెండ్ చిత్రంతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఎనర్జీని ఇచ్చింది. హైదరాబాద్ లో మీ అందరినీ కలవడం ఆనందాన్ని ఇచ్చింది. చాలా భారీ బడ్జెట్ తో తీసిన చిత్రమిది. 28న థియేటర్ లోకి వస్తుంది. అందరం థియేటర్ లో కలుద్దాం. మీ అందరినీ ది లెజెండ్ అలరిస్తుంది” అన్నారు
లక్ష్మీ రాయ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో స్పెషల్ అప్పిరియన్స్ లో ఫోక్ సాంగ్ చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు శరవణన్ లెజెండ్ కు కృతజ్ఞతలు. ఈ టీంతో ఎప్పటి నుండో అనుబంధం వుంది. జులై 28న ఈ సినిమా విడుదలౌతుంది. కంప్లీట్ ఎంటర్ టైనర్ ఇది. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరంతా థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి” అని కోరారు.
ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా వున్న మీరు ఈ వయసులో సినిమా చేయడానికి కారణం ?
లెజెండ్ శరవణన్ : చిన్నప్పటి నుండి సినిమాపై ఆసక్తి వుంది. కానీ మా లైఫ్ స్టయిల్, బిజినెస్ వేరు. బిజినెస్ లో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు సినిమా చేసే అవకాశం రావడంతో చేశాను. వయసు అనేది దీనికి అడ్డంకి కాదని భావిస్తాను.
సినిమా కోసం అరవై కోట్లకు పైగే ఖర్చు చేశారని విన్నాం. ఒక బిజినెస్ మాన్ గా రికవరీ గురించి లెక్కలు వేసుకున్నారా ?
లెజెండ్ శరవణన్ : ఖచ్చితంగా లెక్క వుంటుంది. ప్యాషన్ తో పాటు బిజినెస్ కూడా ముఖ్యం కదా.
మీ అభిమాన నటులు ?
లెజెండ్ శరవణన్ : తమిళ్ లో విజయ్, రజనీకాంత్, తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, హిందీలో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్.
మల్టీ స్టారర్ పై ఆసక్తి ఉందా ?
లెజెండ్ శరవణన్ : లేదండీ. చేస్తే నేను ఒక్కడినే చేస్తాను.
మీ అభిమాన దర్శకులు ?
లెజెండ్ శరవణన్ : రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ గారు అంటే ఇష్టం.
సినిమాలు కొనసాగిస్తా రా ?
లెజెండ్ శరవణన్ : అవును. సినిమాలు కంటిన్యూగా చేస్తా,
జేడీ-జెర్రీ ని దర్శకులుగా తీసుకోవడానికి కారణం ?
లెజెండ్ శరవణన్ : జేడీ-జెర్రీ నాకు మంచి స్నేహితులు. వారితో ఎప్పటి నుండో జర్నీ చేస్తున్నా. ఇది చాలా యునిక్ స్టొరీ. ఈ కథని జేడీ జెర్రీ అద్భుతంగా తీశారు.
ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశం ?
ఎన్వీ ప్రసాద్: ఒక నటుడి లాంచింగ్ మూవీ ఇంత భారీ బడ్జెట్ తో తీశారా ? అనేది షాకింగ్ అనిపించింది. చాలా లావిష్ గా ఈ సినిమాని తీశారు. కొత్త కంటెంట్ ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు సినిమా చూసి ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని భావిస్తున్నా.