అఖిల్ మూవీకి నో చెప్పిన తమన్!..

167
- Advertisement -

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఇటు యూత్ కి నచ్చే పాటలతో .. అటు మాస్ ఆడియన్స్ మెచ్చే పాటలతో తమన్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. అయితే వీటితో పాటు అఖిల్ ‘ఏజెంట్’ సినిమాను చేయడానికి కూడా తమన్ ఒప్పుకున్నాడు. కానీ ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల కారణంగా, ‘ఏజెంట్’ సినిమాను చేయలేనని దర్శకుడు సురేందర్ రెడ్డికి చెప్పాడట. దాంతో ఆయన హిప్ హాప్ తమిజాను తీసుకున్నట్టుగా సమాచారం.

యంగ్ హీరో అక్కినేని అఖిల్‌తో టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ ‘ఏజెంట్’ మూవీ రూపొందుతోంది. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్‌ని ఓ సీక్రెట్ ఏజెంట్‌గా సరికొత్త పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

- Advertisement -