సెప్టెంబ‌ర్‌ 6న ఆది పినిశెట్టి ‘క్లాప్’ టీజ‌ర్‌..

28
Aadhi Pinisetty

హీరో ఆది పినిశెట్టి అథ్లెట్‌గా న‌టిస్తోన్న అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ‘క్లాప్‌’. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ (సర్వంత్ రామ్ క్రియేషన్స్) మరియు ఎం. రాజశేఖర్ రెడ్డి (శ్రీ షిర్డీ సాయి మూవీస్) సంయుక్తంగా నిర్మించారు. ఐబి కార్తికేయ‌న్ (బిగ్‌ప్రింట్ పిక్చ‌ర్స్‌) స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 6న విడుదలకానుంది. ఈసంద‌ర్భంగా విడుద‌ల‌ చేసిన‌ పోస్టర్‌లో ఆది పినిశెట్టి పెద్ద పోటీ కోసం సన్నాహాలు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆ పోస్ట‌ర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. ఒలింపిక్స్‌లో భార‌త‌దేశం మంచి ప్ర‌తిభ‌ను ప్రదర్శిస్తున్ననందున ఈ సినిమా టీజర్ విడుదలకు ఇది సరైన సమయం అని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ మూవీలోఆది స్ప్రింటర్‌గా క‌నిపించ‌డానికి కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆకాంశ సింగ్ కథానాయికగా నటిస్తుండగా, కృష్ణ కురుప్, ప్రకాష్ రాజ్, నాసర్, బ్రహ్మాజీ, మైమ్ గోపి మరియు మునిష్కాంత్ కీల‌క‌పాత్ర‌ల‌లో కనిపిస్తారు. క్లాప్ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

తారాగ‌ణం: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, కృష కురుప్, ప్రకాష్ రాజ్, నాసర్, బ్రహ్మాజీ, మైమ్ గోపి మరియు మునిష్కాంత్
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం: పృథ్వి ఆదిత్య‌
నిర్మాత‌లు: రామాంజనేయులు జవ్వాజీ , M రాజశేఖర్ రెడ్డి
బ్యాన‌ర్స్‌: సర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ‌ షిర్డీ సాయి మూవీస్
స‌మ‌ర్ప‌ణ‌: ఐబి కార్తికేయ‌న్ (బిగ్‌ప్రింట్ పిక్చ‌ర్స్‌)
సంగీతం: ఇళ‌య‌రాజా
డిఒపి: ప్ర‌వీణ్ కుమార్‌
మాట‌లు: వ‌న‌మాలి
ఆర్ట్‌: వైర‌బాల‌న్ & ఎస్ హ‌రిబాబు
ఎడిట‌ర్‌: ర‌ఘు
పిఆర్ఓ: వంశీ – శేఖ‌ర్‌