కరోనా బారిన పడ్డ తమన్‌..

27

టాలీవుడ్‌లో కరోనా కలకలం మళ్లీ మొదలైంది.. వరుసగా ఎంతో మంది సెలెబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్‌కు కరోనా సోకింది. ఈరోజు ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. అందులో పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దాంతో వైద్యుల సలహా మేరకు ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నారు.

గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తమన్ సూచించారు. మరో వైపు, తమన్ త్వరగా కోలుకోవాలంటూ టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.