‘తలైవీ’ కోసం కంగనా ఏంచేసిందో చూడండి..!

452
Kangana Ranaut
- Advertisement -

దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో త‌లైవీ అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవడ్ బ్యూటీ కంగనా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోంది. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్  ఈ చిత్రం రూపొందిస్తున్నాడు. హిందీలో  ఈమూవీ జ‌య టైటిల్‌తో విడుద‌ల కానుంది.

ఈ చిత్రం కోసం కంగ‌నా భారీ పారితోషికం డిమాండ్ చేసింద‌ని సమాచారం. సినిమాకు విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ‘ది డర్టీ పిక్చర్’ రచయిత రజత్ అరోరా కంబైన్డ్‌గా కథను అందించారు.

Kangana

ప్రస్తుతం కంగనా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. ప్రాస్తెటిక్స్ చేయించుకోవడానికి హాలీవుడ్ ఫేమస్ ఆర్టిస్ట్ జేసన్ కోలిన్స్‌ను సంప్రదించారు. ఆయన స్టూడియోలో కంగన‌కు ప్రాస్తెటిక్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు. కంగనాను కుర్చీలో కూర్చోపెట్టి ముఖం నిండా లైట్ గ్రీన్, బ్లూ కలర్ లిక్విడ్ పోశారు. ఆ సమయంలో తీసిన ఫొటోలను కంగన సోషల్ మీడియా సిబ్బంది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

‘తలైవి సినిమా కోసం లాస్ ఏంజెల్స్‌లోని జేసన్ కాలిన్స్ స్టూడియోలో కంగన ప్రాస్తెటిక్ మెజర్‌మెంట్స్ తీయించుకుంటున్నారు. జేసన్ గతంలో కెప్టెన్ మార్వెల్ సినిమా కోసం పనిచేవారు. జయలలిత బయోపిక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉండబోతోందని చెప్పాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది.

- Advertisement -