అసెంబ్లీలో కంటతడిపెట్టిన గొంగిడి సునీత..

546
sunitha
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన తండ్రిని గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంత మయ్యారు ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కిడ్నీ వ్యాధుల బారిన పడి, డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తే.. ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఆమె చెప్పిన తీరు అందర్నీ ఆలోచింపజేసింది.

మా నాన్న 14 ఏళ్లు డయాలసిస్ చేయించుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో చితికిపోయాం. ఆ బాధేంటో నాకు తెలుసంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువగా ఉందని…దీంతో కిడ్నీలు పాడవటం అనే సమస్య ఎక్కువగా ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు.

ఇంటి పెద్ద డయాలసిస్ పెషెంట్ అయితే కుటుంబం ఉపాధి కోల్పోతుంది. అతడితో పాటు ఆ కుటుంబం కూడా చాలా బాధలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ సమస్య తీవ్రంగా ఉండటంతో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, ఇతరులకు ఇస్తున్నట్టుగానే డయాలసిస్ చేయించుకునే పేషెంట్లకు కూడా ఆసరా పింఛన్లు అందించాలని ఆమె కోరారు.

- Advertisement -