10 వేల రైతు సంఘాల ఏర్పాటు..ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్లు

374
budget 2019
- Advertisement -

10 వేల రైతు సంఘాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు నిర్మలా సీతారామన్‌. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా మాట్లాడిన నిర్మలా బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

జలశక్తి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘హర్‌ ఘర్‌ జల్‌’ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా చేస్తామన్నారు. జీరో బడ్జెట్‌ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం) ప్రవేశపెడుతున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే అనేకమంది రైతులకు శిక్షణ ఇచ్చామన్నారు.

1.25లక్షల కి.మీ. మేర రహదారుల ఆధునీకీకరణ చేపడతామన్నారు. విమానాల తయారీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. రోడ్ల నిర్మాణానికి 80 వేల 250 కోట్లు కేటాయించామన్నారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యమన్నారు. న్యూ స్పేస్ ఇండియా కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్టాక్ మార్కెట్లలో ఎన్నారై పెట్టుబడులకు అనుమతిస్తామన్నారు.

జల్ జీవన్ మిషన్‌తో నీటి కష్టాలు దూరమవుతాయని చెప్పారు. ఒకే కార్డుతో రైల్వే,బస్సు,విమానంలో ప్రయాణం చేయొచ్చన్నారు.

- Advertisement -