బుల్లితెర యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది. ముసాపేట్ లో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని ముసాపాట నుంచి బంజారాహిల్స్ కు వెళ్తున్న రవి కారును వెనుకనుంచి డీసీఎం ఢికొట్టింది. ప్రమాదం సమయంలో రవి కారును డ్రైవర్ నడుపుతున్నాడు. ఈఘటనను రవి వీడియో ద్వారా చిత్రికరించి తన యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. అయితే డీసీఎం వచ్చి కారును ఢికొట్టిన వెంటనే డీసీఎం డ్రైవర్ వద్దకు వెళ్లాడు రవి. డ్రైవర్ ఫుల్ గా తాగి ఉన్నట్లు తెలిపాడు. కాసేపటి తర్వాత డీసీఎం డ్రైవర్, క్లినర్ ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారని చెప్పాడు. దీంతో వెంటనే డీసీఎం కు ఉన్న కీ, ఐడీ కార్డును తీసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు రవి.
దీంతో వెంటనే సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు యాక్సిడెంట్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ను వెళ్లి డీసీఎం డ్రైవర్ పై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రమాదంలో రవికి ఎలాంటి ప్రమాదం కాలేదు. కానీ కారు వెనుక భాగం కొద్దిగా పాడయింది. యాంకర్ రవి మాట్లాడుతూ.. పట్టపగలే హైదరాబాద్ లో ఇలా డీసీఎం డ్రైవర్ తాగి నడపడం ఎంటని ప్రశ్నించారు.
ఇలాంటి వాల్ల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఎంత సెక్యూరిటీ పెట్టిన ఇలానే ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్ఛించాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్టెమెంట్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు యాంకర్ రవి. సకాలంలో స్పందించటంతో పాటు కేసు నమోదు విషయంలో వాళ్లు వ్యవహరించిన తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడు.