సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఝూన్సీ ప్రియుడు సూర్యను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 306, 417 ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సూర్య వేధింపుల కారణంగానే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. ఆమె చనిపోవడానికి కొన్నిగంటల ముందు సూర్యకు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఝాన్సీ సూర్య కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారని, ఝాన్సీ చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా సూర్యకు కాల్స్ చేసిందని పోలీసులు వెల్లడించారు. ఝాన్సీ సీరియల్స్ లో నటించడం సూర్యకు ఇష్టం లేదని నటన మానేయమని సూర్య చాలా సార్లు ఒత్తిడి చేశాడని.
దీంతో మనస్ధాపానికి గురైన ఝూన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. గతకొంత కాలంగా ఝాన్సీని ఆమె ప్రియుడు సూర్య మానసికంగా వేధిస్తున్నాడని, ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా నటనను మాన్పించాడని పోలీసులు పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాంటే నటన మానేయాలని ఆంక్షలు విధించాడని, ఆ తరువాత అతను మోసం చేయడంతో ఝాన్సీ ఆత్మహత్య చేసుందని పోలీసులు తెలిపారు.ఈ మేరకు నిందితుడు సూర్యను అరెస్ట్ చేసి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.