నిర్మాతలుగా మారిన ఆ ఇద్దరు హీరోయిన్లు..

373
kajal Tamanaha
- Advertisement -

ఇద్దరు టాలీవుడ్ అందమైన భామలు నిర్మాతలుగా మారారు. ఇప్పటికే వివిధ బిజినెస్ లలో బిజీగా ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరా అనుకుంటున్నారా? చందమామ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. కేఏ మూవీస్ బ్యానర్లో ఒక సినిమాను నిర్మించాలని.. ఆ సినిమాలో నటించాలని ప్లాన్ చేస్తోందట ఈముద్దుగుమ్మ. ఈచిత్రానికి ‘అ!’ మూవీ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు.

Kajal Tamannaha

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం కాజల్ తో పాటు ఈప్రాజెక్ట్ లో మరో హీరోయిన్ కూడా జాయిన్ అయ్యిందట. కాజల్ క్లోజ్ ఫ్రెండ్.. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ప్రాజెక్టుకు స్లీపింగ్ పార్టనర్ గా వ్యవహరిస్తుందని టాక్. ఈ సినిమాకు కథ ఎప్పుడో ఓకే అయిందట. కాజల్ ‘అ!’ సినిమాలో నటించిన సమయంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ కథను వినిపించడంతో అప్పుడే ఈ సినిమాను నిర్మించాలని కాజల్ నిర్ణయం తీసుకుందట. హీరోయిన్లుగా మంచి విజయాలను అందుకున్న కాజల్, తమన్నాలు నిర్మాణ రంగంలో విజయం సాధిస్తారో లేదో చూడాలి.

- Advertisement -