తెలుగు సినిమాకు మరిన్ని అవార్డులు..

25
- Advertisement -

జాతీయ అవార్డులు గెలుచుకున్న నటీనటులకు తెలుగు చలనచిత్ర మండలి హృదయ పూర్వక అభినందనలు తెలిపింది. ఈ మేరకు కేఎల్ దామోదర్ ప్రసాద్, టీ ప్రసన్న కుమార్, వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ..నిర్మాత D.V.V. దానయ్య మరియు దర్శకులు రాజమౌళి నిర్మించిన “RRR” సినిమా Wholesome Entertainment సినిమా, అవార్డుతో బాటు ఆ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డు M. M. కీరవాణికి, బెస్ట్ మెల్ ప్లేబాక్ సింగర్ కాలభైరవకి, బెస్ట్ (స్టంట్ కొరియోగ్రఫీ) డైరెక్షన్ అవార్డు కింగ్ సాలోమన్ కి, బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు ప్రేమ్ రక్షిత్ కి, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు వి. శ్రీనివాస్ మోహన్ కి, “పుష్ప” సినిమాలో తన అద్భుత నటనకు Best Actor అవార్డు పొందిన అల్లు అర్జున్ కి, ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు పొందిన దేవిశ్రీ ప్రసాద్ కి, బెస్ట్ తెలుగు సినిమా అవార్డు ఉప్పెన నిర్మించిన సాన బుచ్చిబాబుకి, బెస్ట్ లిరిక్స్ రైటర్ అవార్డు గ్రహీత (“కొండ పొలం”సినిమా) చంద్ర బోస్ కి, మరియు ఉత్తమ సినీ విమర్శకుల అవార్డు పొందిన పురుషోత్తమ ఆచార్యులు అభినందనలు తెలిపారు. మున్ముందు మరిన్ని అవార్డులు మన తెలుగు సినిమాలకు లభిస్తాయని ఆశిస్తున్నాం అన్నారు.

Also Read:ఆ రెండు చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -