పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇక సినిమాలకు దూరం కాబోతున్నాడా.. ఎక్కవ సమయం రాజకీయాలకే కేటాయించబోతున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. పవన్ జనసేన పార్టీ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకుంటున్న నేపథ్యంలో పవన్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తాడనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు అటు సినిమాలు ఇటు రాజకీయాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న పవన్ కల్యాణ్ ఇక అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని ప్రకటించడంతో ఆయన ఇక సినిమాలు చేయడన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వస్తే ఆయన సినిమాల జోరు తగ్గుతుందా అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పవన్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుండగా ఈ మూవీ తర్వాత ఆర్ టీ నీసన్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఏఎంరత్నం నిర్మించనున్న ఈ మూవీ ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
