వాటిలో మాత్రమే ఉచితం..అన్నిట్లో కాదండోయ్!

48
- Advertisement -

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ధీమాగా చెబుతూ వచ్చింది హస్తం పార్టీ. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన తరువాత సి‌ఎం హోదాలో తొలి సంతకం ఆరు గ్యారెంటీలపైనే చేశారు సి‌ఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ ఆరు హామీలలో ప్రధానంగా మహిళలను ఎక్కువగా ఆకర్షించిన పథకం ‘ మహాలక్ష్మి పథకం ‘. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ. 500 లకే వంటగ్యాస్, ప్రతి మహిళకు నెలకు రూ.2500 సాయం.. ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో ఇకపై మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చు. అన్నీ వర్గాల మహిళలకు, ట్రాన్స్ జెండర్ లకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఇందులో ఓ చిన్న మెలిక పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఉచిత బస్సు ప్రయాణం అన్నీ బస్సుల్లో ఉండదని తేల్చి చెప్పింది. కేవలం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మహిళలకు కొంత గందరగోళానికి లోనయ్యే అవకాశం ఉందని రాజకీయ వాదులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే పరిమితి బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని ముందు చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిమితులు విధించడం ఏంటనే డౌట్ చాలామందిలో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీంతో మిగిలిన పథకాల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులు విధించే అవకాశం ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

Also Read:వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి..

- Advertisement -