శ్రీశైలం ఘటనలో చనిపోయిన ఇంజనీర్ లకు 24వ తేదీన విద్యుత్ సౌధలో సంతాప సభ జరుగుతుందని తెలిపారు విద్యుత్ శాఖ ఇంజనీర్స్.9 మంది చనిపోతే కనీసం సంతాపం తెలుపలేదని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవం అని వారు తెలిపారు.24వ తేదీన విద్యుత్ సౌధ ఉద్యోగులు అందరం సంతాప సభలో పాల్గొన్నాం…..అశ్రునయనాలతో వారికి నివాళులు అర్పించాం అని తెలిపారు.ప్రతిపక్ష పార్టీలు ఇంజనీర్స్ చావులతో రాజకీయం చేయడం తగదని విద్యుత్ శాఖ ఇంజనీర్స్ సూచించారు.
అశ్రునయనాల తో వారికి నివాళులు అర్పించాం.సిఎండి ప్రభాకర్ రావు సంతాప సభలో మాట్లాడుతూ దుఃఖం ను ఆపుకోలేక ఏడవడం జరిగింది.బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు,అదే రోజు హైదరాబాద్ లో బాధితుల కుటుంబాల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అన్ని పవర్ స్టేషన్ లో ఇతర విద్యుత్ కార్యాలయాలలో కూడా సంతాప సభలు పెట్టడం జరిగిందన్నారు.శ్రీశైలం ఘటన పై విద్యుత్ సంస్థ,ఇంజనీర్స్, ఇతర ఉద్యోగులు చాలా బాధలో ఉన్నారు.బాధిత కుటుంబాలను ఎలా ఆదుకోవాలని, ఇలాంటి పునరావృతం కాకుండా తోసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించాము.
ఇంజనీర్ చావులతో రాజకీయం చేయడం తగదు.రాజకీయం చేసి మా మనోధైర్యం దెబ్బతీయవద్దు.టెక్నీకల్ ఎంక్వైరీ లో అన్ని నిజాలు ,ప్రమాద కారణాలు బయటకు వస్తాయి.విద్యుత్ ఉద్యోగులకు మనోధైర్యం కలిగించేలా కృషి చేయాలన్నారు.