మరో రెండు రోజులు వర్షాలు…

155
rains

నైరుతి ఝార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 km ఎత్తు వరకు కొనసాగుతోంది.ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది.సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట,మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, ఖమ్మం, మెహబూబాబాద్, వరంగల్ -పట్టణ,మరియు వరంగల్-గ్రామీణ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట,జనగామ, ఖమ్మం, మెహబూబాబాద్, వరంగల్ -పట్టణ, మరియు వరంగల్-గ్రామీణ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.