సఫల రాష్ట్రంగా తెలంగాణ:కేసీఆర్

293
ts assembly
- Advertisement -

దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఓ సఫల రాష్ట్రంగా,పురోగామి రాష్ట్రంగా ముందడుగు వేస్తోందన్నారు సీఎం కేసీఆర్. ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ 2018-19 ప్రవేశపెట్టిన సీఎం ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆరవ బడ్జెట్ అన్నారు.2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు అన్నిరంగాల్లో వెనుకబడి ఉందన్నారు. సమైక్యపాలనలో జరిగిన దుప్పరిణామాలు మనల్ని వెంటాడాయన్నారు. కరెంట్ కోతలతో అల్లాడమన్నారు.వలస కరువులు,వలస బ్రతుకులతో గుక్కెడునీటి కోసం అల్లాడమన్నారు.

తెలంగాణ పునర్‌ నిర్మాణం కోసం జరిగిన ప్రమాణంలో మంచి ఫలితాలు సాధించామన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని స్వల్పకాలంలోనే అధిగమించి చీకట్లను అధిగమించామన్నారు. బలహీనవర్గాలకు ప్రత్యేక ఆర్థిక ప్రేరణ ఇచ్చామన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగామన్నారు. తెలంగాణ యావత్ దేశానికే రోల్ మోడల్‌గా మారిందన్నారు.

కేవలం మేనిఫెస్టోలో పేర్కొన్న కార్యక్రమాలకే కాకుండా కొత్త కార్యక్రమాలతో అందరి మన్ననలను పొందామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో లబ్దిపొందని కుటుంబం లేదన్నారు. తెలంగాణ వృద్ధిరేటు గణనీయంగా పెరిగిందన్నారు.2018-19లో తెలంగాణ వృద్ధిరేట 10.5 శాతంగా నమోదైందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమని చెప్పారు.

- Advertisement -