ప్రగతి పద్దు 2019- హైలైట్స్‌..

214
kcr budget
- Advertisement -

దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఓ సఫల రాష్ట్రంగా,పురోగామి రాష్ట్రంగా ముందడుగు వేస్తోందన్నారు సీఎం కేసీఆర్. ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ 2018-19 ప్రవేశపెట్టిన సీఎం ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆరవ బడ్జెట్ అన్నారు.టీఎస్ ఐపాస్‌తో పారిశ్రామిక ప్రగతి మెరుగుపడిందన్నారు.ఆసరా పింఛన్లతో బడుగుబలహీన వర్గాల వారిని ఆదుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఆసర పింఛన్లు తన హృదయానికి దగ్గరయ్యాయని చెప్పారు.

తెలంగాణ బడ్జెట్ లైవ్..

బడ్జెట్ హైలైట్స్‌

()ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి
() రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు
() మూలధన వ్యయం రూ.32,815కోట్లు
() రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు
()కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450కోట్లు.
() ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581కోట్లు
()ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు
()బియ్యం రాయితీకి రూ.2,774కోట్లు
()ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
() వ్యవసాయశాఖకు రూ.20,107కోట్ల కేటాయింపు.
() నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు కేటాయింపు
()ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536కోట్లు
() పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ.3,256కోట్లు
() 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8లక్షల నిధులు
() టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.1.41లక్షల కోట్ల పెట్టుబడులు
() టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు

()రూపాయికే కిలో బియ్యం
()ఆసరా పింఛన్ల కోసం 12 వేల 700 కోట్లు
()కళ్యాణలక్ష్మీ ద్వారా 3 లక్షల 28 వేలు,షాది ముబార్‌ ద్వారా లక్ష మంది ఆర్థిక సహాయం పొందారు
()కళ్యాణలక్ష్మీ కోసం 1450 కోట్లు
()నిరుద్యోగభృతి కోసం విధివిధానాల రూపకల్పన,1810 కోట్ల రూపాయల కేటాయింపు
()ఎస్సీఎస్టీల ప్రయోజనాల కోసం కృషి,16,580 కోట్ల ప్రగతి నిధి
()మైనార్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక అభివృద్ధి
()రంజాన్,క్రిస్ మస్‌ వేడుకలను అధికారికంగా నిర్వహణ
()మైనార్టీల అభివృద్ధి కోసం రూ.2004 కోట్లు
()రైతు బంధు,రైతు బీమాతో తెలంగాణ ప్రభుత్వానికి మంచి గుర్తింపు
()ఫుడ్ ప్రాసెసింట్ యూనిట్ల ఏర్పాటు
()నకిలీ విత్తనాలు కల్తీ విత్తనాల తయారీ దారులపై ఉక్కుపాదం
()కొత్తగా 360 గోదాంల నిర్మాణం చేశాం
()సాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం భారీ ప్రాజెక్టుల నిర్మాణం
()రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ సరఫరా
()రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లు
()రైతుబంధు ఆర్థికసహాయం పెంపు,ఏడాదికిఎకరానికి 10 వేల సాయం
()రైతుబంధు పథకం కోసం రూ. 12 వేల కోట్లు
()రైతు బీమా పథకం కోసం రూ.650 కోట్లు
()ధరణి వెబ్‌సైట్ ద్వారా భూరికార్డుల వివరాలు
()దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116కు పెంచుతున్నాం.
()వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తాం.
()ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,067కోట్లు కేటాయిస్తున్నాం.

()వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,536కోట్లు
()బీసీల కోసం 119 గురుకులాల ఏర్పాటు.

- Advertisement -