రెండో దశ కంటి వెలుగుకు శ్రీకారం

291
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే యేడాది జనవరి18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ అదేశించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం అమ‌లు తీరుపై సీఎం కేసీఆర్ ఇవాళ స‌మీక్షించారు. ప్ర‌జారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ‌, ఇత‌ర మంత్రుల‌తో కేసీఆర్ స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కంటి వెలుగు కార్య‌క్ర‌మం మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని నిర్ణయం తీసుకున్నారు.

గతంలో కూడా ఈ పథకం …

తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఈ కార్యక్రమాన్ని రెండవ దశలో తెలంగాణ వ్యాప్తంగా విసృతస్థాయిలో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. మొదటిసారి కంటివెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్‌ చేత ప్రారంభించిన సంగతి తెలిసిందే. కంటివెలుగు పథకం కోసం ఐదు నెలల పాటు కొనసాగింది.

తెలంగాణలోని ఎంతో మంది వృద్ధులు, చిన్నారులు, పేదలకు, మధ్యవయస్కులకు ఈ పథకం చాలా బాగా ఉపయోగపడింది. ఇందులో అవసరం ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు మరియు ఉచితంగా శస్ర్త పరీక్షలు, మందులు ఇచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.106కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయించింది.

కంటి వెలుగు తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకం ద్వారా ఎంతోమంది వృద్దులకు మేలు జరిగింది. తెలంగాణలోని జిల్లాల్లో కంటి సమస్యలతో సతమతమవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం భావించి ముందుచూపుతో తెలంగాణలోని ప్రతి పౌరునికి కంటివెలుగు పథకం వర్తించేలా ప్రణాళికలు రచించింది. ఇందుకోసం అవసరమైన వైద్యబృందం మరియు అధికారులను నియమించింది.

ప్రతి క్యాంప్‌లో డాక్టర్‌తో పాటు నలుగురు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. స్థానిక ప్రాధమిక వైద్యశాల సిబ్బంది సమన్వయంతో కంటి పరీక్షలు, కళ్ల అద్దాలను అందజేయడంతో పాటుగా కంటి ఆపరేషన్‌లను కూడా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం వైద్యశాఖ అధికారులకు మార్గనిర్దేశం చేసింది.

ఇవి కూడా చదవండి..

వైరలవుతున్న ఆలనాటి జ్ఞాపకం కానీ…

భావోద్వేగానికి గురైన బాబు ఎక్కడంటే..

టమోటా తో ఆరోగ్యం….

- Advertisement -