బాహుబలిని మించిన ఆర్‌ఆర్‌ఆర్‌…

93
- Advertisement -

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి సినిమా సరసన ఆర్‌ఆర్‌ఆర్‌ నిలిచింది. ఈ యేడాది మార్చిలో విడుదల అయిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అక్టోబర్‌ 21న జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అరుదైన రికార్డు అందుకుంది.

జపాన్‌లో కేవలం నాలుగు వారాల్లోనే 250మిలియన్‌ యెన్‌లు రాబట్టి భారతీయ సినిమాగా నిలిచింది. బాహుబలి2 ఈఫిగర్‌ను చేరుకోవడానికి 36 వారాలు తీసుకోగా…ఆర్‌ఆర్‌ఆర్‌ మాత్రం కేవలం నాలుగు వారాలు తీసుకుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రాంచరణ్‌ (Ram Charan) అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్ర పోషించాడు. ‌ఈ ఎపిక్‌ డ్రామాలో అలియాభట్‌, అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియాశరణ్‌, ఒలివియా మొర్రీస్‌, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

ఇవి కూడా చదవండి..

త్వరలో కృష్ణ మెమోరియల్ ట్రస్ట్‌…

ట్రాన్స్‌జెండర్‌గా సిద్ధిఖీ…

కాంతారకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన తైలవ

- Advertisement -