గుర్తింపు లేని 72 కళాశాలలకు నోటీసులు

335
tsbie
- Advertisement -

హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుర్తింపు లేని జూనియర్ కళాశాలలకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 79 కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. నోటీసులకు స్పందించకుంటే కళాశాలలు మూసివేస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ పేర్కొన్నారు. ఈ నెల 25 తేదీ లోపు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కాలేజీలకు అగ్నిమాపక అనుమతి లేదని, మరికొన్ని కాలేజీలకు ఓ చోట అనుమతి తీసుకుని, అదే పేరుతో అనుమతి లేకుండా మరోచోట నడుపుతున్నారని చెప్పారు.

- Advertisement -