తెలంగాణలో కొత్తగా 247 కరోనా కేసులు నమోదు..

21

రాష్ట్రంలో కరోనాను దాదాపు పూర్తిగా కట్టడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 51,521 కరోనా పరీక్షలు నిర్వహించగా, 247 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 71 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 315 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,411 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,55,625 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,877 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,909కి పెరిగింది.