రిజిస్ట్రేషన్లు షురూ…

132
cm kcr
- Advertisement -

మంగళవారం నుండి ప్రభుత్వ పనిదినాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్‌ను 10 రోజులు పొడగించగా ఉదయం 6 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిలాక్సేషన్ అమల్లో ఉండనుంది. ఇంటికి చేరడానికి ఒక గంట సమయం ఇచ్చి మధ్యాహ్నం రెండు నుంచి ఉదయం 6 వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు.

రాష్ట్రంలో కొత్తగా 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు చేయగా మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి,కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్సాటు కానున్నాయి. విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రాధాన్యతగా కోవిడ్ వాక్సినేషన్ వేయనుండగా త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

- Advertisement -