సిద్దిపేటకు నర్సింగ్ కాలేజ్ మంజూరు

32
kcr

సిద్దిపేట నర్సింగ్ కాలేజ్‌కు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సిద్దిపేట నర్సింగ్ కాలేజ్ కు 50కోట్లు నిధులు మంజూరు చేశారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయగా రాష్ట్రంలో 13 నర్సింగ్ కాలేజ్ లు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 100 సీట్లు కేటాయిస్తు..108 పోస్టులను మంజూరు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుండి సిద్దిపేట నర్సింగ్ కళాశాల ప్రారంభం కానుంది. సిద్దిపేట కు నర్సింగ్ కళాశాల ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు మంత్రి హరీశ్ రావు.