రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఆర్యవైశ్యభవన్ లో విషం తాగి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అయితే ఇప్పుడు మారుతీరావు ఆస్తీ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కిరోసిన్ వ్యాపారిగా ఉన్న మారుతీరావు వందల కోట్ల అధిపతిగా ఎలా ఎదిగాడన్నది అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఉన్న సమాచారం మేరకు మారుతీరావుకు రూ.200కోట్లు వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది.
మిర్యాలగూడలో అమృత హాస్పిటల్ పేరుతో వంద పడకల ఆస్పత్రి ఉంది. పట్టణంలోనే అతడి భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి కూడా ఉంది. హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల స్థలం ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో పలు చోట్ల ఐదు ఫ్లాట్లు, నల్లగొండలోని మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్, ఈదులగూడెం క్రాస్ రోడ్‌లో మరో షాపింగ్ మాల్ ఉన్నాయి. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో మారుతీరావు, శ్రవణ్ కుమార్ లు వంద వరకు విల్లాలు అమ్మినట్లు తెలుస్తుంది. మారుతీరావు ఆస్తీ ఇప్పుడు ఎవరికి దక్కుతుందనే అంశమే ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.