ఆర్ధికపరమైన ఇబ్బందులు లేవు: శ్రవణ్

420
maruthirao
- Advertisement -

తమకు ఆర్ధికపరమైన ఇబ్బందులు లేవన్నారు మారుతీరావు తమ్ముడు శ్రవణ్. మిర్యాలగూడలో మీడియాతో మాట్లాడిన శ్రవణ్…తమకు ఆర్ధిక కష్టాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే తమని సంప్రదించవచ్చన్నారు.

మారుతీరావు తన వీలునామాను 2018 మార్చి రాసాడని…అన్నయ్యకు సంబంధించిన ఒక్క పైసా తనకు అవసరం లేదన్నారు. అమృతను మీడియాలో ఎక్కువ షైన్ చేయొద్దని విజ్ఞప్తి చేసిన ఆయన ఆమెకు మెచురిటీ లేదు. ఏవేవో మాట్లాడుతుందన్నారు. తన వదిన మెడలో పుస్తెలతాడు తిస్తేనే తాను తీస్తా అన్న అమృత…ఏ మొఖం పెట్టుకుని వస్తుందని ప్రశ్నించారు.

ప్రేమ గల తండ్రిని కోల్పోవడం ఆమె దురదృష్టమని…ఆమె పట్ల చాలా ప్రేమతో ఉండేవాడన్నారు. ఏనాడూ అమృతను ఒక్క మాట అనలేదన్నారు.

- Advertisement -