పంద్రాగస్టు వేళ….. రాష్ట్రంలో హై అలెర్ట్‌

64
high
- Advertisement -

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు నగరంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు కీలక నగరాలను పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘా పెంచనున్నారు.

ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో 10వేలమందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే ఎర్రకోట చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలపై షూటర్లను మోహరించడంతో పాటు నో ఫ్లయింగ్ జోన్లు అమలు చేస్తున్నారు. గాలి పటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా నిషేధం విధించగా.. నగరవ్యాప్తంగా వెయ్యికిపైగా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి
భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -