రాజన్న రాజ్యమా..రాక్షస రాజ్యమా..!

176
sharmila
- Advertisement -

తెలంగాణలో మరో ఆంధ్రా పార్టీ ఏర్పాటుకు జగనన్న చెల్లెమ్మ షర్మిలక్క రెడీ అవుతున్నరు..ఆంధ్రాకు చెందిన షర్మిలక్క తెలంగాణలో రాజన్న రాజ్యం లేదంటూ తెలంగాణ సమాజాన్ని అవమానిస్తోంది. ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలనేది రాజన్న లక్ష్యమంట… ప్రస్తుతం తెలంగాణలో ఆ పరిస్థితులు లేవంట. రైతులు సంతోషంగా లేరంట…విద్యార్థులు ఉచితంగా చదువుతలేరంట.. రాజన్న రాజ్యం తనతోనే వస్తుందంట.. ఆంధ్రా వలస నేతల అహంకారమే షర్మిలక్క మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. అసలు తెలంగాణ గురించి ఏం తెలుసని షర్మిలక్క మాట్లాడుతోంది. రాజన్న రాజ్యం కంటే కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉంది..రాజన్న రాజ్యంలో ఏనాడైనా మన తెలంగాణ రైతన్నలు మూడు పంటలు పండించిన్రా..గుక్కెడు తాగునీళ్లకు అల్లాడిపోయినం…కరెంట్ కోతలతో రాష్ట్రం అంధకారంలో ఉండేది. మన రైతన్నలు అర్థరాత్రి మోటార్లు వేసి పంటలు తడుపుకునేందుకు పొలాలకు వెళ్లి కరెంట్ షాకులతో, పాముకాట్లతో చనిపోయేవాళ్లు…అసలు మీ నాయిన కాదా.. పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టి రాత్రికి రాత్రి నీళ్లను రాయలసీమకు తరలించుకుపోయింది. మన తెలంగాణ పొలాలను ఎండబెట్టి ఆంధ్రా ప్రాంతానికి నీళ్లు తరలించుకుపోయేవారు.

గత 60 ఏళ్లలో ఆంధ్రా వలస పాలకులు వ్యవసాయాన్ని దండగ చేస్తే ఆరున్నరేళ్లలో కేసీఆర్ సర్కార్ వ్యవసాయాన్ని పండుగలా చేసింది. కాళేశ్వరంతో ఆరు దశాబ్దాల నీటి గోస తీర్చింది. ఒకప్పుడు బీడువారిన భూముల్లో బంగారు సిరులు పండుతున్నాయి. ఆరున్నరేళ్లలోనే తెలంగాణ దేశానికే ధాన్య బండారంగా మారింది…ఈ విషయాలు షర్మిలక్కకు తెలుసో లేదో..మీ రాజన్న రాజ్యంలో కంటే ఇప్పుడు రైతన్న దర్జాగా కాలుమీద కాలేసుకుని బతుకుతుండు.. ఆనాడు షర్మిలక్క చెబుతున్న రాజన్న రాజ్యంలో రైతుబంధు పథకం ఉందా…రైతు బీమా పథకం ఉందా.. ఏనాడై తెలంగాణ రైతన్నలు మూడు పంటలు వేశారా..తెలంగాణ పొలాలను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోయిన ఆంధ్రా పక్షపాత పాలకుడు..వైఎస్. ఇక రాజన్న రాజ్యంలో ఘనంగా చెప్పుకునే ఉచిత విద్యుత్తు 9 గంటలు ఇస్తే తెలంగాణలో ఇఫ్పుడు 24 గంటల విద్యుత్తు అందుతుంది..ఇదైనా తెలుసా షర్మిలక్క.. మీ నాయన పాలనలో ఎరువులు, విత్తనాల కోసం మండుటెండల్లో చెప్పులేకుండా నిలబడిన రైతన్నలపై లాఠీచార్జీలు చేయించిన ఘటనలు కోకొల్లలు..అంతెందుకు ముదిగొండలో పోలీసులతో ఏకే 47 తుపాకులతో కాల్పులు జరిపించి 7 గురు రైతన్నలను పొట్టన పెట్టుకున్న కిరాతక పాలకుడు మీ నాయన వైఎస్ కాదా… అయినా ఎంత చెడు చేసినా…కాస్తంత మంచి చేస్తే చాలు మా తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకుంటరు.

ఇప్పటికీ మీ నాయినను తెలంగాణ ప్రజలు గౌరవిస్తరు..ఇవన్నీ మర్చిపోయి…రైతులు సంతోషంగా ఉన్నారా అని అమాయకంగా అడుగుతున్నవ్..మా తెలంగాణలో రైతులు సంతోషంగనే ఉన్నరు కాని…మీ ఆంధ్రాలో రైతన్నల సంతోషం గురించి ఆలోచించమ్మా…మీ అన్న చేసిన పనికి అక్కడ అమరావతిలో ఏడాదికి పైగా రైతన్నలు రోడ్ల మీద పడి లొల్లి చేస్తున్నరు..ముందు ఆడికి వెళ్లి మాట్లాడు..ఇక తెలంగాణ ప్రజల గురించి మీకెందుకు…అక్కడ మీ అన్న మంచిగనో, చెడ్డగనో..కాస్త బుద్ధిగనే పాలన చేసుకుంటుండు..తెలంగాణలో నాకు స్థానంలేదని అర్థమై ఏపీకి పోయి తన పనేదో తాను చేసుకుంటుండు.. మీ అన్న నీకు ఏం పదవి ఇవ్వలేదని కోపం ఉంటే ఏపీకి పోయి పార్టీ పెట్టి పోరాడు..అది కాకుండా తెలంగాణకు వచ్చి మళ్లీ ఆంధ్రా వలస పాలన తీసుకువస్తామంటే తెలంగాణ బిడ్డలు నిన్ను ఆంధ్రా బోర్డర్ల దాకా తరిమికొడుతురంటూ తెలంగాణ ప్రజలు షర్మిలక్కపై మండిపడుతున్నరు.

- Advertisement -