హైదరాబాద్ కు చెందిన సుమారు 40 మంది మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేపాల్ లోని భారత రాయబారితో తెలుగు యాత్రికుల గురించి మాట్లాడానని చెప్పారు ఢిల్లీ లోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి.
ట్రావెల్స్ యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. వాతావరణం సహకరించగానే హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా రాష్ట్రానికి తరలించాలని వారిని కోరానని తెలిపారు. యాత్రలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని చెప్పారు.
చైనా-నేపాల్ సరిహద్దు ప్రాంతమైన మానస సరోవర్‌కు ఈనెల 13న వీరంతా వెళ్లారు. యాత్రికులు గత ఐదు రోజులుగా అక్కడ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. రక్షించాలంటూ వారు తమ కుటుంబ సభ్యులకు వీడియోలు పంపించారు. తమలో కొంతమంది అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.