ప్రజలే టీఆర్ఎస్‌కు అండ: కవిత

149
kavitha
- Advertisement -

తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్‌కు అండ అన్నారు ఎమ్మెల్సీ కవిత. నల్గొండ జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరైన కవిత..తెలంగాణకు శ్రీరామరక్షగా ఉన్న టీఆర్ఎస్ను కాపాడుకోవాలన్నారు. యాదాద్రి ఆలయ పునఃనిర్మాణం తెలంగాణకే కాక యావత్ ప్రపంచానికే తలమానికమన్నారు.

ఎన్ని పార్టీలు ఇబ్బందులకు గురిచేసినా.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉంటారని చెప్పారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు ప్రజలు ఎంతో గౌరవం ఇస్తున్నారని అన్నారు. రకరకాల పార్టీలు వస్తూ ఉన్నాయి కాని ఎప్పటికీ ఉండేది టీఆర్ఎస్ పార్టీనే అని ఆమె చెప్పారు. ఉద్యమ సమయంలో కూడా అనేక అంశాలతో ఉద్యమాన్ని ఆగం చేసే ప్రయత్నం చేశారని కానీ ప్రజలు టీఆర్ఎస్‌నే ఆదరించారని గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -