తెలంగాణలో ప్రస్తుతం వైఎస్ షర్మిలా రాజకీయం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె పాదయాత్రల్లో ఘాటైన విమర్శలతో హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ పెట్టిన మొదట్లో ఆచితూచి మాట్లాడుతూ వచ్చిన షర్మిల.. ప్రస్తుతం వ్యక్తిగత విమర్శలలే ప్రదాన అస్త్రంగా ముందుకు కదులుతోంది. ఇక మొదటి నుంచి కూడా షర్మిల పార్టీపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేదనేది జగమెరిగిన సత్యం ఎందుకంటే.. ఏపీలోని తన అన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో విభేదాల కారణంగానే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టిందనేది అందరికీ తెలిసిన విషయమే.
ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేకపొయిఉంటే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టేనా ? అనే ప్రశ్నకు వైతెపా నుంచి ఎలాంటి సమాధానం ఉండదు. అందువల్ల ఆంధ్రాలో అన్నకు పోటీగా కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయంగా ఎదిగేందుకు షర్మిల ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఆమె పార్టీని తెలంగాణ ప్రజలు ఏ మాత్రం కన్సిడర్ చేయడం లేదనేది వాస్తవం. అయితే ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు పాదయాత్ర చేపట్టినప్పటికి.. ఆమె పాదయాత్రను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో అధికార టిఆర్‌ఎస్ నేతలపై ఘాటైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ షర్మిల రాజకీయ లభ్ది పొందేందుకు చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎందుకంటే ఈ మద్య కాలంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే.. స్పష్టంగా అర్థమౌతుంది. దాంతో పాదయాత్ర పేరు చెప్పి ప్రజలను హింసకు ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయడం షర్మిల వ్యూహాలను అద్దం పడుతున్నాయి. దీంతో మెజారిటీ ప్రజలు ఆమె పాదయాత్రను ఖండించే పరిస్థితులు ఏర్పడ్డాయి. పాదయాత్రకు కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేరరాదని మందలించింది. అయినప్పటికి ఆమె మాత్రం హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం మానడం లేదు. దీంతో ఆమె పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఫలితంగా ఆమె ఆమరణ నిరాహారదీక్షకు దిగడం.. ఆ తరువాత ఆసుపత్రిలో చేరడం.. ఇవన్నీ కూడా కేవలం రాజకీయ లబ్ది పొందేందుకే తప్పా.. ఇంకోటి కాదనే విషయం తేటతెల్లమౌతోంది. మొత్తానికి టిఆర్‌ఎస్ పార్టీ పై బురద చల్లే ప్రణాళికలు ఎన్ని వేసినప్పటికి.. ప్రజలు షర్మిలను నమ్మే పరిస్థితిలో లేరనేది కాదనలేని వాస్తవం.
ఇవి కూడా చదవండి…