జికా వైరస్ లక్షణాలు, నివారణ చర్యలు

96
- Advertisement -

భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో తొలిసారి జికా వైరస్ కనుగొనబడినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. రాయచూర్ జిల్లా మాన్వి తాలూకాలోని కొలికాంప్‌కు చెందన ఐదేళ్ల బాలికకు జికా వైరస్ సోకింది. దేశంలో ఇదివరకే కేరళ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్  రాష్ట్రాల్లో కనుగొన్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కనుగొనడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.

మాండౌస్ తుఫాన్‌ కారణంగా చినుకులు మరియు వాతావరణంలో కీలకమైన మార్పులు సంభవిస్తున్నాయన్నారు. చల్లని ఉష్ణోగ్రతలు వైరస్‌ను వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కావచ్చు అని తెలిపింది. కావున ప్రజలు దోమల నుండి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చికెన్‌గున్యా డెంగ్యూ లక్షణాలే కాకుండా మరే ఇతర లక్షణాలు ఉన్న వెంటనే ప్రభుత్వాసుపత్రులో చేరాలని పిలుపునిచ్చారు. మన

జికా వైరస్‌ను 1947లో ఉగాండాలో మొదటిసారిగా గుర్తించారు. 1952లో ఉగాండా టాంజానియాల్లో మనుషులకు జికా వైరస్ సోకినట్టు ప్రకటించారు. అప్పటినుంచి 2007వరకు కొత్త కేసులు నమోదు కాలేదని కానీ 2007లో 2013లోనూ పలు దేశాల్లో కొన్ని కేసులు బయటపడ్డాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015 2016లో జికా వైరస్‌ మహమ్మారిగా మారిందని తెలిపింది. దానికి తగ్గట్టుగానే వైద్య సదుపాయాలను ఆఫ్రికాలోని జికా వైరస్ ప్రభావిత దేశాల్లకు ఉచితంగా మందులు సరఫరా చేసింది.

జికా వైరస్ లక్షణాలు జ్వరం చర్మంపై దద్దుర్లు కండరాల నొప్పులు ఉంటాయి. మరియు కొందరిలో మెదడు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ప్రపంచారోగ్య సంస్థ ప్రకటించింది. ఇది ఏడెస్ అనే దోమలు ద్వారా వ్యాప్తిస్తుందని ఇవి సాధారణంగా పగటిపూట కుడతాయని పేర్కొన్నారు. ఇప్పటివరకూ జికా వైరస్ అంతంకు ఎటువంటి మెడిసిన్ ఉత్పత్తి కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీనికి గున్యా డెంగ్యూకు వాడే మందులను మాత్రమే ఇవ్వనున్నారు.  దోమల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలపింది. ఎప్పటికప్పుడూ నీటిని నిల్వ ఉంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇవి కూడా చదవండి…

ఏపీలో బి‌ఆర్‌ఎస్.. మంచిదే : సజ్జల

చైనా ఉచ్చులో.. 82దేశాలు విలవిల

మీ ఆట అనితర సాధ్యం:కోహ్లీ

- Advertisement -