టీ కాంగ్రెస్ నేతల్లో ముసలం.. !

228
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోంది. ఒకప్పుడు రాష్ట్రంలో టి‌ఆర్‌ఎస్ తరువాత రాష్ట్రంలో రెండవ బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల ముందుతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా బలహీన పడిందనే చెప్పాలి. ముఖ్యంగా టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తరువాత ఆ పార్టీలో అంతర్లీన కుమ్ములాటలు విపరీతంగా పెరిగిపోయాయి. పార్టీలోని సీనియర్ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవిని అధిష్టించడం జీర్ణించుకోలేకపోయారు. ఫలితంగా రేవంత్ రెడ్డి వర్సస్ కాంగ్రెస్ సీనియర్ నేతల మద్య ఆదిపత్య వార్ కొనసాగుతూ వచ్చింది..

దీంతో మీకు మీరే మాకు మేమే అన్న రీతిలో రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ సీనియర్ నేతల రాజకీయం కొనసాగింది. ఈ పరిణామాల కారణంగా పార్టీ నెమ్మదిగా పట్టు కోల్పోతూ వచ్చింది. అలాగే సీనియర్ నేతలంతా కూడా వరుసపెట్టి పార్టీని వీడే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంతలా బలహీన పడిందంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న మునుగోడులో సైతం డిపాజిట్ కూడా దక్కించుకోలేక చేస్తులెత్తేసింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో బలహీన పడిందనే విషయం. దీంతో పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలతో కలగొలుపుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే పార్టీలో సంస్థాగత మార్పుల కోసం ఏఐసీసీ కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కమిటీల ఏర్పాటులో కొందరు సీనియర్ నేతలకు చోటు దక్కకపోవడంతో వారు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కమిటీలలో చోటు దక్కలేదు. దీనికి కారణం మునుగోడు ఎన్నికల నేపథ్యంలో వెంకటరెడ్డి వ్యవహరించిన తీరే అని చెప్పుకోవచ్చు. పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక అప్పటినుంచి ఆయన కాంగ్రెస్ విడతారనే వార్తలు చక్కర్లు కొడుతునే ఉన్నాయి. ఇక తాజాగా ఏర్పాటు చేసిన టీపీసీసీ కమిటీలలో తనకు సరైన ప్రదాన్యం కల్పించలేదని ఆ పార్టీ సిరియర్ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు. ఇంకా మరికొంత మంది కూడా కమిటీల ఏర్పాటుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళంతా కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి టీ కాంగ్రెస్ నేతల్లో చోటు చూసుకుంటున్న ముసలం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇవి కూడా చదవండి…

రేవంత్‌కు షాక్..కొండా రాజీనామా

పవన్ తెలంగాణలో సత్తా చాటుతారా ?

గృహ సారధి, జగన్ కొత్త కాన్సెప్ట్ !

- Advertisement -