పంచాయతీ ఎన్నికలు..అర్హతలు

560
panchayat telangana
- Advertisement -

తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోడ్ కూసేసింది. పంచాయతీ ఎన్నికలకు నగారా మోగడంతో బరిలో ఆశావాహులతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. సర్పంచ్,వార్డు సభ్యులకు ప్రత్యేక గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం పోటీచేసే అభ్యర్థులకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.

అర్హతలు :

() అభ్యర్థి వయస్సు 21 ఏళ్లకంటే తక్కువ ఉండకూడదు. పోటీ చేసే అభ్యర్థి కచ్చితంగా పోటీ చేసే పంచాయతీలో సభ్యుడిగా ఉండాలి.

() మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన వారు అన్ – రిజర్వ్‌డ్ స్థానాలకు పోటీ చేయొచ్చు.

()రేషన్ డీలర్లు, సహకార సంఘాల సభ్యులు అర్హులు.

()రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం లోపుగా ఉన్న సంస్థల ఏజెంట్ / మేనేజర్ / కార్యదర్శుల సైతం పోటీకి అర్హులు

()ఎస్సీ, బీసీ రిజ్వర్వుడ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా
ప్రకటించిన ఏదైనా సామాజికవర్గానికి చెందిన వారు ఉండాలి.

()ఎస్సీ రిజర్డ్ స్థానాల్లో అభ్యర్థులు అభ్యర్థులు షెడ్యూల్డ్ తెగలు (తెలంగాణకు సంబంధించిన)గా ప్రకటించిన ఏదైనా ఒక కులం, తెగకు
(కమ్యూనిటీ) చెందిన వారై ఉండాలి.

()పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఆర్టీసీ, సింగరేణి సంస్థల్లో మేనేజింగ్ ఏజెంట్ / మేనేజర్ / కార్యదర్శులు తప్ప మిగిలిన ఉద్యోగులు అర్హులు.

అనర్హతలు :

() క్రిమినల్ కోర్టు ద్వారా శిక్ష పడితే సర్పంచ్ పదవికి అనర్హులు.

() మతిస్థిమితం లేనివారు.. చెవిటి మూగ వారు అనర్హులు.

()ప్రస్తుత, గత ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీకి, పడిన బకాయిని చెల్లించాలంటే బిల్లు / నోటీసులు అందుకుని.. గడువులోగా బకాయి
చెల్లించని వారు అనర్హులు.

() మత సంబంధ సంస్థల ఛైర్మన్, సభ్యులు అనర్హులు.

() పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్దత పొందిన ఏదైనా సంస్థలో ఆఫీస్ బేరర్‌గా ఉండకూడదు.

() ఏదైనా పారితోషకం పొందుతూ పంచాయతీ తరపున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న వారు అనర్హులు.

()దివాలా తీసిన లేదా దివాలా నుండి వెలుపలికి రాని వ్యక్తిగా కోర్టు నిర్ణయించిన వారు, ఇన్ సాల్వెన్సీకి దరఖాస్తు చేసుకున్న వారు అనర్హులు.

- Advertisement -