వైసీపీలోకి అలీ..ఎంపీగా పోటీ..!

236
ali jagan
- Advertisement -

ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇప్పటికే పాదయాత్రతో జనంతో మమేకం అవుతున్న వైసీపీ చీఫ్ జగన్ పార్టీకి మరింత సినీ గ్లామర్‌ అద్దెందుకు సిద్ధమయ్యారు. పవన్‌ సన్నిహితుడు,కామెడియన్ అలీని పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు.

విజయవాడ లేదా రాజమండ్రి నుంచి అలీని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అలీ సొంత జిల్లా, నియోజకవర్గం రాజమండ్రి కావడంతో ఇక్కడినుండి బరిలోకి దింపింతే బాగుంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారట. అలీ సైతం రాజమండ్రి నుండి పోటీ చేసేందుకు ఆసక్తికనబరుస్తున్నారట.

ఒకవేళ రాజమండ్రి సీటు మిస్సైన విజయవాడ నుండి పోటీచేసేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడట అలీ. మొత్తంగా తన సన్నిహితుడు పవన్‌ పార్టీ నుండి కాకుండా అలీ వైసీపీలో చేరుతారన్న వార్తలతో ఏపీ పాలిటిక్స్‌ హిటెక్కాయి. మరి రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరెవరు ఎన్నికల బరిలో నిలుస్తారు…ఏ పార్టీ నుండి నిలబడతారన్నది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

- Advertisement -