ఫిబ్రవరి9న తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు

230
Jayesh Ranjan

తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఫిబ్రవరి 9న ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరుగనుంది. తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి టీఆర్ఎస్ తరపున తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పోటిపడుతుండగా, బీజేపీ తరపున మాజీ ఎంపీ జితెందర్ రెడ్డిలు పోటీలో ఉన్నారు.

ఇక కార్యదర్శి పదవికి అరిసనపల్లి జగన్ మోహన్ రావు, జగదీశ్వర్ యాదవ్ లు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలను ఢిల్లీ లో జరపాలని సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. మరోవైపు తెలంగాణలోనే ఎన్నికలు జరపాలని జయేష్ రంజన్ ప్యానల్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై మరికాసేపట్లో కోర్టు తీర్పు ఇవ్వనుంది.