రాష్ట్రంలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంన్నందున రాజకీయ నాయకుల పాదయాత్రలు, రోడ్ షో లు కూడా చేపట్టవద్దని తెలిపారు సీఈఓ శశాంక్ గోయల్. ఎమ్మెల్యే కోటాలో ఆరింటికి నోటిఫికేషన్,స్థానిక కోటాలో 12 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు 29న పోలింగ్ ఓటింగ్ ముగిసిన అనంతరం తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుండగా డిసెంబర్ 10న స్థానిక కోటా పోలింగ్.. 14న కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే డిసెంబర్ 16 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్లోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో మండలికి ప్రా తినిథ్యం వహించిన ఆకుల లలి త, మహమ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడి యం శ్రీహరి పదవీకాలం ఈ ఏడాది జూన్ 3న ముగిసింది. కాలపరిమితిలోపే జరుగాల్సిన ఎ న్నికలను కరోనా వ్యాప్తి నేపథ్యం లో ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అక్టోబర్ 31న షెడ్యూ ల్ విడుదల చేసింది.
ఆదిలాబాద్ జిల్లాలో 1, వరంగల్ 1, నల్లగొండ 1, మెదక్ 1, నిజామాబాద్ 1, ఖమ్మం 1, కరీంనగర్ 2, మహబూబ్నగర్ 2, రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు.