అత్యవసరం అయితే తప్ప బయటకురావొద్దు:మంత్రులు

65
minister

తెలంగాణలో లాక్ డౌన్‌ మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో లాక్ డౌన్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి. లాక్ డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కరోనా విస్తరించకుండా ప్రజలు తోడ్పాటు అందించాలన్నారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గంలో లాక్‌డౌన్‌ పక్కా అమలయ్యేలా చూడాలి అని అధికారుల‌ను ఆదేశించారు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి. గ్రామాల్లో విస్తరించిన మహమ్మారి ప్రజల స్వీయ నియంత్రణతో తగ్గుముఖం పడుతున్నా..ఇంకా అప్రమత్తంగానే ఉండాలి అని చెప్పారు.

పోలీస్ యంత్రాంగం లాక్ డౌన్ పక్కా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. అన్ని మండల కేంద్రాలతో పాటు, గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నాలుగు గంటల పాటు సడలింపు ఉన్న నేపథ్యంలో ఆ సమయంలోనే రైతులు కూడా వారికి అవసరమైన ఫెస్టిసైడ్స్, విత్తనాలు,వ్యవసాయ పనిముట్లు తీసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు.